Makthal: మక్తల్‌లో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా ఆయుధ పూజ!

Makthal: మక్తల్‌లోని ఛత్రపతి శివాజీ నగర్‌లో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో దుర్గామాత మండపం వద్ద ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు.

B. NARENDER, MAKTHAL
Published on: 19 Oct 2026 1:44 PM IST
Makthal
X

Makthal: మక్తల్‌లో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా ఆయుధ పూజ!

Makthal: మక్తల్ పట్టణంలోని దుర్గామాత మండపం వద్ద ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్న విశ్వ హిందూ పరిషత్, భీమ్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్ , భీమన్న,బజరంగ్ దళ్ జిల్లా కో- కన్వీనర్ భీమేష్, సభ్యులు దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ,సంతోషాలతో, ఆయురారోగ్యాలతో విరాజిల్లాలని బజరంగ్ దళ్ జిల్లా కో- కన్వీనర్ భీమేష్ ఆకాంక్షించారు.

మక్తల్ మున్సిపాలిటీ కేంద్రంలోని చత్రపతి శివాజీ నగర్ ఆవరణలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద బజరంగ్ మండల సంయోజక్ రామాంజనేయులు,ఆధ్వర్యంలో ఆయుధ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వ హిందూ పరిషత్, భీమ్ రెడ్డి, సత్యనారాయణ, భీమన్న, బజరంగ్ దళ్ జిల్లా కో- కన్వీనర్ భీమేష్,హాజరై ప్రత్యేక పూజలు, అనంతరం ఆయుధపూజ, నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రఖండ సహ సంయోజక్ మూర్తి, నాగరాజ్, అక్షయ్,వంశీ, రామాంజనేయులు, శ్రీను, పరశురాం, అరవింద్,

విశాల్,ఆనంద్,ప్రవీణ్,నిర్వాహకులు పాల్గొన్నారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL