Kothakota: కొత్తకోటలో నవంబర్ 11 నుంచి అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ!
Kothakota: కొత్తకోట శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప క్షేత్రంలో నవంబర్ 11 నుంచి అయ్యప్ప స్వాములకు అరిటాకుల్లో సాత్విక అన్నప్రసాద వితరణ చేపడుతున్నట్లు సేవా సమితి తెలిపింది.
Kothakota: కొత్తకోటలో నవంబర్ 11 నుంచి అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ!
Kothakota: శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప క్షేత్రం ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో దూపం నాగరాజు (అధ్యక్షులు, అయ్యప్ప సేవా సమితి) అధ్యక్షతన కొత్తకోట, మదనాపురం మండలాలకు చెందిన సమస్త అయ్యప్ప భక్తులు, హిందూ బంధువులు, గతంలో దీక్ష స్వీకరించిన అయ్యప్ప స్వాములు, గురుస్వాములు పాల్గొన్నారు.
గత ఏడాది లెక్కల వివరాల వెల్లడి
గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఆలయ నిర్మాణం కోసం సేకరించిన విరాళాలు, వాటి ఖర్చులు, అన్నదాన కార్యక్రమం కోసం సేకరించిన నిధులు, వాటి ఖర్చుల వివరాలను సభ్యుల సమక్షంలో సవివరంగా వివరించడం జరిగింది. ఈ లెక్కలపై సభ్యులు ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. అనంతరం సభ్యులందరూ తమ సమ్మతిని సంతకాల ద్వారా తెలియజేశారు.
అన్నదాన కార్యక్రమంపై కీలక నిర్ణయాలు
ఈ సంవత్సరం నిర్వహించనున్న అయ్యప్ప స్వాముల అన్నప్రసాద వితరణ కార్యక్రమంపై విస్తృతంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
1. నవంబర్ 11వ తేదీ నుంచి అయ్యప్ప స్వాముల అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.
2. గత సంప్రదాయం ప్రకారం పూర్తిస్థాయి సాత్విక ఆహారంతో, అరిటాకులపై బంతి భోజన పద్ధతిలో అన్నప్రసాదం అందించాలని సభ్యులందరూ ముక్తకంఠంతో నిర్ణయించారు.
3. అయ్యప్ప స్వాములు ప్రతిరోజూ మధ్యాహ్న భిక్షను ఆలయ ప్రాంగణంలోనే స్వీకరించాలని సూచించారు. ఎవరూ వ్యక్తిగతంగా తమ ఇళ్ల వద్ద భిక్ష ఏర్పాటు చేసి స్వాములను ఆహ్వానించకూడదని నిర్ణయించారు. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారికి జరిమానా విధించాలని సమావేశంలో నిర్ణయించారు.
4. పట్టణంలో నిర్వహించే మహాపడిపూజలు, పటం పూజ కార్యక్రమాలను సాయంత్రం వేళల్లో మాత్రమే నిర్వహించాలని, మధ్యాహ్న సమయంలో నిర్వహించేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా అయ్యప్ప సేవా సమితి గౌరవ అధ్యక్షులు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రముఖ గురుస్వామి బ్రహ్మశ్రీ శ్రీ జోషి గోపాలకృష్ణ గురు స్వామి గారు మాట్లాడుతూ భక్తులందరి సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కోరారు.
ఈ సమావేశంలో అయ్యప్ప సేవా సమితి కమిటీ సభ్యులు, ఆలయ నిర్వాహకులు అనీల్ కుమార్ లింగేశ్వర్, గంగాధర్, సుధాకర్ రెడ్డి, సత్యం సాగర్ , విశ్వమోహనాచారి , గుంత కళ్యాణ్ , రఘునాథ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, భాస్కర్ , మద్దిగట్ల బాలకృష్ణ రెడ్డి, మహేష్ రెడ్డి, రవి గౌడ్ గురు స్వామి , నాగరాల శివ కుమార్ రెడ్డి , భీమ కిషోర్ , సతీష్ , YS రాజశేఖర్ అయ్యప్ప దీక్షదారులు తదితరులు పాల్గొన్నారు.




