Nagarkurnool: అన్నదానంతో ఆధ్యాత్మిక సేవ.. రూ.90 వేల విరాళమిచ్చిన అయ్యప్ప స్వాములు!

Nagarkurnool: నాగర్‌కర్నూల్ శ్రీ ధర్మశాస్తా అయ్యప్ప ఆలయంలో అన్నప్రసాద వితరణకు శ్రీ మణికంఠ సన్నిధానం అయ్యప్ప స్వాములు ఆదివారం రూ.90 వేల విరాళం అందజేశారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 29 Nov 2026 6:50 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: అన్నదానంతో ఆధ్యాత్మిక సేవ.. రూ.90 వేల విరాళమిచ్చిన అయ్యప్ప స్వాములు!

నాగర్ కర్నూల్: ఆకలితో వచ్చిన భక్తుడికి అన్నం పెట్టడం కన్నా గొప్ప సేవ మరొకటి లేదనే భావనతో అయ్యప్ప స్వాములు సేవా కార్యక్రమానికి చేయూతనందించారు. కార్తీక మాసం, మండల దీక్షా కాలాన్ని పురస్కరించుకుని నాగర్ కర్నూల్ పట్టణంలోని శ్రీ ధర్మశాస్తా అయ్యప్పస్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణకు రూ.90 వేల విరాళాన్ని అందజేశారు.

శ్రీ మణికంఠ సన్నిధానం గురుస్వాములు ముళ్ళపాటి జగన్, రాగిశెట్టి పాండు, ఖానాపురం ప్రదీప్ ఆధ్వర్యంలో సన్నిధానం స్వాములు ఈ విరాళాన్ని ఆలయ కమిటీ ప్రతినిధులకు అందించారు. ఈ సందర్భంగా గురుస్వాములు మాట్లాడుతూ... మండల దీక్షలో భాగంగా నియమ నిష్ఠలతో అయ్యప్ప మాలను ధరించి ఆలయానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదం అందించడం పవిత్రమైన సేవగా భావిస్తున్నామన్నారు.

అయ్యప్ప భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ఆకలి తీర్చే అన్నప్రసాదం అందించడం ఎంతో సంతృప్తినిస్తుందని పేర్కొన్నారు. అన్నదానం కేవలం ఆహారం అందించడమే కాకుండా భక్తి, సేవాభావం, మానవత్వాన్ని చాటే గొప్ప కార్యక్రమమని తెలిపారు.

దీక్షా కాలం ముగిసే వరకు అన్నప్రసాద వితరణ నిరంతరాయంగా కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. సేవాభావంతో విరాళం అందించిన గురుస్వాములు, స్వాములను ఆలయ కమిటీ సభ్యులు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL