Kollapur: కొల్లాపూర్‌లో 5 ఎకరాల క్రీడా మైదానం ఏర్పాటు చేయాలి: క్రీడాకారులు!

Kollapur: కొల్లాపూర్ పట్టణంలో మెరుగైన వసతులతో 5 ఎకరాల క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని కోరుతూ క్రీడాకారులు ఆర్డీవో బన్సీలాల్‌కు వినతిపత్రం అందజేశారు.

VENKATESWARA CHARY, KOLLAPUR
Published on: 23 Nov 2026 9:31 PM IST
Kollapur
X

Kollapur: కొల్లాపూర్‌లో 5 ఎకరాల క్రీడా మైదానం ఏర్పాటు చేయాలి: క్రీడాకారులు!

కొల్లాపూర్: కొల్లాపూర్ నియోజక వర్గ కేంద్రంలో మెరుగైన వసతులతో కూడిన క్రీడా మైదానానికి ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని కోరుతూ క్రీడాకారులు ఆర్డిఓ బన్సలాల్ కు పలు డిమాండ్ లతో కూడిన వినతి పత్రం అందజేశారు. స్పందించిన ఆర్డిఓ బన్సీలాల్ సానుకూలంగా స్పందించారు క్రీడాకారుల కోసం మైదానాన్ని ఏర్పాటు చేసేందుకోసం భూమిని పరిశీలిస్తామన్నారు.

అనంతరం క్రీడాకారులు మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజక వర్గంలో యువకులకు క్రీడల పై ఆసక్తి ఉందని క్రీడాకారులుగా ఎదిగేందుకు కేరిర్ ను ఎంచుకుంటున్నారని క్రీడాకారులు తెలిపారు. సరైన వసతులు గ్రౌండ్ లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు స్పందించి క్రీడాకారుల కోసం ఐదు ఎకరాల క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు క్రీడాకారులపై మంచి ఉద్దేశంతో వీపనగండ్లలో తన సొంత భూమిని క్రీడా మైదానానికి అధికారులకు అప్పగించారని తెలిపారు.అలాగే ఏల్లూరులో క్రీడాకారుల కోసం అక్కడ కూడా క్రీడామైదానాన్నికి ఏర్పాట్లు చేస్తున్నారని వారు గుర్తు చేశారు. అలాగే కొల్లాపూర్ లో కూడా యువ క్రీడాకారులు క్రీడల్లో రాణించేందుకు కోసం తగిన వసతులు,మైదానాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

కొల్లాపూర్ లో ఉన్న జఫర్ మైదానం మినీ స్టేడియం క్రీడాకారులకు సరిపోవడంలేదన్నారు. మైదానం చిన్నదిగా ఉండడంతో ఉదయం సాయంత్రం వేళలో వాకర్ లు కూడా అక్కడే ఉంటున్నారని దానివల్ల క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వీటిని దృష్టిలో పెట్టుకొని ఐదు ఎకరాల క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయాలని క్రీడాకారులు విజ్ఞప్తి చేశారు.

VENKATESWARA CHARY, KOLLAPUR

VENKATESWARA CHARY, KOLLAPUR