Nagarkurnool: 26న సీఎం రేవంత్ రెడ్డి మద్దిమడుగు పర్యటన.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్!

Nagarkurnool: ఈ నెల 26న సీఎం రేవంత్ రెడ్డి మద్దిమడుగు పర్యటన, సంత్ సేవాలాల్ విగ్రహ శంకుస్థాపన ఏర్పాట్లను నాగర్ కర్నూల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ పరిశీలించారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 24 Nov 2026 5:45 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: 26న సీఎం రేవంత్ రెడ్డి మద్దిమడుగు పర్యటన.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్!

నాగర్కర్నూల్: 26న సీఎం రేవంత్ రెడ్డి మద్దిమడుగు పర్యటన... సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ శంకుస్థాపన, ఆంజనేయ స్వామి దర్శనం... పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశం.ఈ నెల 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దిమడుగు పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లాకలెక్టర్హేమంత్కేశవ్పాటిల్అధికారులనుఆదేశించారు.గురువారం ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రి నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని శ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ శంకుస్థాపన పనులతో పాటు మద్దిమడుగు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని సందర్శించనున్నారు.

ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ముఖ్యమంత్రి కార్యాలయ భద్రతా అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ మద్దిమడుగు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని సందర్శించారు.హెలిప్యాడ్ నుండి ముఖ్యమంత్రి ఆలయానికి చేరుకున్న సమయంలో నిర్వహించే పూర్ణకుంభ స్వాగతం, వినాయక విగ్రహ దర్శనం, ఆలయ ప్రదక్షిణ, శ్రీ ఆంజనేయస్వామి దర్శనం, శివలింగ దర్శనం తదితర కార్యక్రమాల నిర్వహణపై పరిశీలన చేశారు.ముఖ్యమంత్రి ఆలయంలోకి ప్రవేశించే మార్గం, బయటకు వచ్చే మార్గం, భద్రతా ఏర్పాట్లు, వీఐపీల రాకపోకలపై అధికారులకు సూచనలు చేశారు.అనంతరం ఆలయ అర్చకులతో కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడారు.

దర్శన క్రమం, అర్చకుల ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాల అందజేత తదితర సంప్రదాయ కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం హెలిప్యాడ్ స్థలాన్ని కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. హెలిప్యాడ్ పరిసరాల్లో భద్రత, పార్కింగ్, రాకపోకల మార్గాలపై అధికారులతో చర్చించారు.సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ శంకుస్థాపన ఏర్పాట్లను, సుమారు 5 వేల మంది గిరిజనులతో ముఖ్యమంత్రి నిర్వహించనున్న ముఖాముఖి కార్యక్రమానికి సంబంధించిన సభా ప్రాంగణం, వేదిక, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, భద్రత, పార్కింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు.

అనంతరం మద్దిమడుగు గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ కార్యాలయంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి పర్యటన జిల్లాకు అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమమని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి తమకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.భద్రతా ఏర్పాట్లలో పోలీస్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, విద్యుత్ శాఖ నిరంతర విద్యుత్ సరఫరా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య ఆరోగ్య శాఖ అంబులెన్స్ లు, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ... నల్లమల అడవి ప్రాంతంలోని మద్దిమడుగులో ఎలాంటి లోటుపాట్లు లేకుండా భద్రతా అంశాలలో పోలీసు అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి 5 వేలకు పైగా గిరిజనులు సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమానికి పాల్గొంటారని, గిరిజన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA