Nagarkurnool: రాష్ట్ర వార్డు మెంబర్స్ ఫోరం కార్యనిర్వాహక సభ్యుడిగా శివప్రసాద్!

Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా జూపల్లి గ్రామానికి చెందిన అరెకంటి శివప్రసాద్ తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్స్ ఫోరం రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులుగా నియమితులయ్యారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 21 Nov 2026 7:55 AM IST
Nagarkurnool
X

Nagarkurnool: రాష్ట్ర వార్డు మెంబర్స్ ఫోరం కార్యనిర్వాహక సభ్యుడిగా శివప్రసాద్!

Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా, జూపల్లి గ్రామానికి చెందిన అరెకంటి శివప్రసాద్ ను తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్స్ ఫోరం రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులుగా నియమిస్తూ ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి నాగబెల్లి జ్యోతి మహేష్ నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా అరెకంటి శివప్రసాద్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర స్థాయి బాధ్యతను అప్పగించిన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి మహేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వార్డు సభ్యుల గొంతుకను బలంగా వినిపిస్తూ, గ్రామాల అభివృద్ధి కోసం, వార్డు సభ్యుల హక్కులు, గౌరవం, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

గ్రామ, మండల, జిల్లా స్థాయిలోని ప్రతి వార్డు సభ్యుడిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి, ఐక్యతతో ముందుకు నడిపిస్తూ, వారి సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వార్డు సభ్యులకు తగిన గుర్తింపు, గౌరవం, హక్కులు, బాధ్యతలు కల్పించే దిశగా ఫోరం ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు.

అందరి సహకారంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ, తెలంగాణ రాష్ట్ర వార్డు సభ్యుల ఫోరం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అరెకంటి శివప్రసాద్ తెలిపారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY