Lingala: 11:30 దాటినా తెరుచుకోని అంబటిపల్లి పశువైద్యశాల

Lingala: లింగాల మండలం అంబటిపల్లి పశువైద్యశాల ఉదయం 11:30 దాటినా తెరవకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు; డాక్టర్ కళ్యాణ్ ఫోన్‌కు అందలేదు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 31 Oct 2026 7:27 PM IST
Lingala
X

Lingala: 11:30 దాటినా తెరుచుకోని అంబటిపల్లి పశువైద్యశాల

Lingala: లింగాల మండలం అంబటిపల్లి గ్రామంలోని పశు వైద్యశాల ఉదయం 11:30 గంటలు దాటినా తెరుచుకోకపోవడంతో పశుపోషకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వ పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో XIX కొత్త ఊర్ల నిధులతో నిర్మించిన ఈ వైద్యశాలలో సిబ్బంది సమయపాలన పాటించడం లేదని, రోజూ ఇదే పరిస్థితి నెలకొందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువులకు వ్యాధులు సోకినా, టీకాలు, కృత్రిమ గర్భధారణ సేవల కోసం వచ్చిన రైతులు గంటల తరబడి వేచి చూసి వెనుదిరుగుతున్నారు.

డాక్టర్ కళ్యాణ్ ఫోన్లో అందుబాటులోకి రాలేదు:

ఈ విషయమై పశు వైద్యాధికారి డాక్టర్ కళ్యాణ్ ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్లో అందుబాటులోకి రాలేదు.

ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనం నిరుపయోగంగా మారుతోందని, జిల్లా పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA