Kothakota: కొత్తకోట భవానీ శంకర ఆలయంలో గాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారు!

Kothakota: కొత్తకోట భవానీ శంకర ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు. రెండో రోజు గాయత్రీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన అంబా భవానీ మాత. అన్నప్రసాద వితరణ.

B. KISHORE KUMAR, KOTTHAKOTA
Published on: 12 Oct 2026 6:10 PM IST
Kothakota
X

Kothakota: కొత్తకోట భవానీ శంకర ఆలయంలో గాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారు!

Kothakota: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం శ్రీ భవానీ శంకర దేవాలయంలో శ్రీ అంబా భవానీ మాత గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.

ఆలయ ప్రధాన అర్చకులు సదాశివయ్య గారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు, ముఖ్యంగా మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కమిటీ నిర్వాహకులు పొగాకు మహేష్ బాబు, పొగాకు రాఘవేంద్ర ప్రసాద్, పొగాకు అనిల్ కుమార్ గార్లు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

B. KISHORE KUMAR, KOTTHAKOTA

B. KISHORE KUMAR, KOTTHAKOTA