Narayanpet: నారాయణపేట ప్రతి వార్డుకు రూ.10 లక్షలు కేటాయించాలి: వెంకటేష్ గౌడ్

Narayanpet: నారాయణపేట పురపాలక సంఘం పరిధిలోని ప్రతి వార్డుకు రూ.10 లక్షలు కేటాయించాలని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్రే వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు.

P.HANMANTHU, NARAYANAPETA
Published on: 2 Nov 2026 7:10 PM IST
Narayanpet
X

Narayanpet: నారాయణపేట ప్రతి వార్డుకు రూ.10 లక్షలు కేటాయించాలి: వెంకటేష్ గౌడ్

నారాయణపేట: నారాయణపేట బీజేపీ మున్సిపల్ చైర్మన్ కొండా శ్వేత సత్య యాదవ్ గారు బాధ్యతలు చేపట్టి నేటికి 9 నెలలు గడుస్తున్నా, ఇప్పటికే 4 కౌన్సిల్ సమావేశాలు జరిగినప్పటికీ పట్టణంలోని ఏ ఒక్క వార్డులోనూ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించకపోవడం విచారకరమని నారాయణపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రే వెంకటేష్ గౌడ్ విమర్శించారు.

ప్రతి కౌన్సిల్ సమావేశంలోనూ బిల్లుల ఆమోదానికే ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప, వార్డుల అభివృద్ధిని, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. వార్డుల అభివృద్ధి కోసం నిధులు అడిగితే మున్సిపాలిటీలో డబ్బులు లేవని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.పట్టణంలోనీ అనేక వార్డుల్లో చిన్న చిన్న సమస్యలు చాలా ఉన్నాయి 9 నెలలు గడుస్తున్నా సమస్యలు పరిష్కరించడంలో విఫలం అయ్యారు. పట్టణంలోని వార్డుల అభివృద్ధిపై శ్రద్ద చూపించాలని, ప్రజాధనాన్ని ప్రజల అవసరాల కోసం వినియోగించాలని సూచించారు.

ఇప్పటికైనా కనీసం ఈ కౌన్సిల్ సమావేశంలోనైనా వార్డుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, నారాయణపేట పట్టణంలోని ప్రతి వార్డుకు రూ.10 లక్షల చొప్పున అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని నారాయణపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రే వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు.

P.HANMANTHU, NARAYANAPETA

P.HANMANTHU, NARAYANAPETA