Devarakadra: ఎండిన వరి పంటలను పరిశీలించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Devarakadra: దేవరకద్ర మండలం డోకూరులో ఎండిన వరి పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎకరాకు ₹50 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Devarakadra: ఎండిన వరి పంటలను పరిశీలించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి
మహబూబ్‌నగర్ జిల్లా: దేవరకద్ర మండలం డోకూరు గ్రామంలో ఎండిపోయిన వరి పంటలను మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పరిశీలించారు. పంటలు ఎండిపోవడంతో నష్టపోయిన రైతులను పరామర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు సిగ్గు ,శరం ,అవగాహన లేని ప్రభుత్వం వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి వల్లే కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపించారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి 800 కిలోమీటర్లు శ్రీశైలం ప్రాజెక్టు నుండి కుప్పం వరకు నీటిని తరలించుకుని పోతే సొంత జిల్లా ముఖ్యమంత్రి కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి కనీసం 8 కిలోమీటర్ల వరకు కూడా సాగునీటిని ఇవ్వలేకపోయారని అన్నారు.
జూరాల ప్రాజెక్టు నుంచి మోటార్ల ద్వారా నీటిని తరలించి కోయిల్‌సాగర్‌ను నింపే అవకాశం ఉన్నప్పటికీ, పాలకులు నిర్లక్ష్యం వహించారని విమర్శించారు.కోయిల్‌సాగర్‌లో రెండు పంటలకు సరిపడా నీరు ఉన్నప్పటికీ, సాగునీటిని విడుదల చేయకపోవడంతో వరి పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి, జిల్లా మొత్తాన్ని కరువు జిల్లాగా ప్రకటించి, పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50 వెల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
పొలం దగ్గరే ఉన్న జానకమ్మ అనే రైతు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో 13 ఎకరాలు వరి వేశానని నీళ్లు అందక పంట మొత్తం ఎండిపోయిందని ఎకరాకు 35 వేల రూపాయల పెట్టుబడి అయిందని దాదాపు 5 లక్షలు రూపాయలు ఖర్చు అయిందని కన్నీరు పెట్టుకున్నారు. డోకోరు గ్రామంలో మొత్తం 600 ఎకరాలలో వరి సాగు చేయగా 400 ఎకరాల వరకు ఎండిపోయిందని రైతులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతులు కోరారు.




