Devarakadra: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: జిఎంఆర్!

Devarakadra: కోయిల్ సాగర్, చిన్న రాజమూర్ గ్రామాల్లో గురువారం మహిళా సంఘం భవనాలు, పాఠశాల మినరల్ వాటర్ ప్లాంట్‌ను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 19 Nov 2026 4:00 PM IST
Devarakadra
X

Devarakadra: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: జిఎంఆర్!

దేవరకద్ర: దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ గ్రామంలో మహిళా సంఘం భవనాన్ని ప్రారంభించి, తదుపరి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి.

అనంతరం చిన్న రాజమూర్ గ్రామంలో మహిళా సంఘం భవనాన్ని ప్రారంభించి, తదనంతరం గ్రామంలోని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాల్లో మండల పార్టీ అధ్యక్షుడు అంజిల్ రెడ్డి ,సర్పంచ్ ముద్దంగుల చంద్రప్ప, మాజీ సర్పంచ్ వెంకటేష్, నాగిరెడ్డి, వార్డు మెంబర్లు శాంతయ్య, తోటప్ప, రాజు, కావలి అంజి, మరియు కావలి ఆంజనేయులు, గజ్జి చిన్న అంజి, గజ్జి పెద్ద అంజి, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA