Achampet: అచ్చంపేట నూతన విద్యుత్ డీఈగా బాధ్యతలు స్వీకరించిన సుధాకర్!
Achampet: నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నూతన విద్యుత్ డివిజన్ డీఈగా సుధాకర్ బాధ్యతల స్వీకరణ. అచ్చంపేట, కల్వకుర్తి సబ్‌డివిజన్లు ఇకపై ఈ డివిజన్ పరిధిలోకి.
Achampet: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఇటీవల అచ్చంపేటలో కొత్తగా ఏర్పడిన విద్యుత్ డివిజనల్ కార్యాలయంలో డీఈగా నియమితులైన సుధాకర్ బుధవారం బాధ్య తలను స్వీకరించారు. స్థానిక ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన అనంతరం మాట్లాడుతూ విద్యుత్ సిబ్బంది అందరూ కలిసికట్టుగా పనిచేసి సంస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. అచ్చంపేట, కల్వకుర్తి సబ్ డివిజన్ ప్రాంతాలు ఈ డివిజనల్ కార్యాలయం పరిధిలోకి రానున్నాయి.




