Achampet: డిండి లిఫ్ట్ రద్దు చేయాలని చారకొండలో లక్ష సంతకాల సేకరణ
Achampet: డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అచ్చంపేట నియోజకవర్గం చారగొండలో లక్ష సంతకాల సేకరణ. పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో రైతుల నిరసన.
Achampet: డిండి లిఫ్ట్ రద్దు చేయాలని చారకొండలో లక్ష సంతకాల సేకరణ
అచ్చంపేట: అచ్చంపేట నియోజకవర్గం చారగొండ మండల కేంద్రంలో డిండి లిఫ్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సంతకాల సేకరణను చేపట్టారు.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చారకొండ మండల కేంద్రంలో శుక్రవారం లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
పాలమూరు అధ్యయన వేదిక కల్వకుర్తి కన్వీనర్ మీ అశోక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిండి లిఫ్ట్ వల్ల పాలమూరు ప్రాంత రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని, కృష్ణా జలాలను అక్రమంగా తరలించే కుట్రలో భాగంగానే డిండి లిఫ్ట్ ను తీసుకువచ్చారని ఆరోపించారు.
పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయకుండా, డిండి లిఫ్ట్ ద్వారా నీటిని మళ్లించడం వల్ల నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని సాగు భూములు ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు.
డిండి లిఫ్ట్ రద్దు చేసి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంతకాలను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని సంతకాలు చేశారు.




