Achampet: అచ్చంపేట మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం
Achampet: అచ్చంపేట మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గోపాల్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్ రెడ్డి హాజరయ్యారు.
Achampet: అచ్చంపేట మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం
అచ్చంపేట: అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, నాగర్కర్నూల్ శాసనసభ్యులు కూచుకుళ్ల రాజేష్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ శివ గౌడ్ తో పాటు పాలకమండలి డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేశారు..
• నూతన పాలకవర్గ సభ్యులు తమ బాధ్యతలను స్వీకరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రైతుల సంక్షేమం, వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి, రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాల కల్పనకు నూతన పాలకవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ మార్కెట్ ద్వారా మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ సభ్యులు, పార్టీ శ్రేణులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.




