Achampet: ఉప్పునుంతల పశువైద్యశాలలో రేకుల షెడ్ ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Achampet: ఉప్పునుంతల పశువైద్యశాలలో నిరుపయోగంగా మారకుండా ట్రెవిస్పై రేకుల షెడ్ ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. కాంపౌండ్ వాల్ నిర్మిస్తామని హామీ.
Achampet: ఉప్పునుంతల పశువైద్యశాలలో రేకుల షెడ్ ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
అచంపేట్: ప్రాథమిక పశువైద్య కేంద్రం , ఉప్పునునుంతల ఎండాకాలం మరియు వానాకాలంలో ఎండకి,వానకి పశువులకు చికిత్స చేయునపుడు ఇబ్బంది లేకుండా నిర్మించిన ట్రెవిస్ పై రేకుల షెడ్డు ని అచంపేట నియోజకవర్గ mla డా చిక్కుడు వంశీకృష్ణ రిబ్బన్ కత్తిరించి ప్రాంభించడం జరిగింది.
అదేవిదంగా మండల రైతులు మరియు పశువైద్య సిబ్బంది తమవంతు ఆర్థిక సహకారం చేసి మూగజీవులకి ఈ విధంగా రేకుల షెడ్ నిరించడం చాల హర్షించదగ్గ మరియు అభినందించాల్సిన విషయం అని అందర్నీ మెచ్చుకున్నారు .అదేవిదంగా పశువైద్యశాల ఆవరణ లో మొరం కొట్టించించిన గ్రామా సర్పంచ్ చింతగాళ్ల శ్రీనుని ప్రత్యేకంగా అభినందించారు .మరియు మండల పశువైద్యాధికారి డా ప్రవీణ్ కుమార్ పశువైద్యశాల కి కాంపౌండ్ గోడ నిర్మిస్తే ఇంకా బాగుంటుంది అని అడగగా mla వంశీకృష్ణ పని జరిగే విదంగా చర్య తీస్కుంటాని చెప్పడం జరిగింది.
చివరగా మాట్లాడుతూ రైతులందరూ ఇపుడున్న కరువు పరిస్థిని దృష్టిలో ఉంచుకుని జాబ్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు పశువుల మేకల గొర్రెల పందుల పెంపకానికి ప్రభుత్వ ఆర్థిక సహకారం అందిస్తుంది దాని అందరు వినియోగించుకోవాలని తెలియచేయడం జరిగింది.
ఈ సందర్బంగా డా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ షెడ్ నిర్మానానికి సహకరించిన రైతులు,కదిరి కృష్ణయ్య ఆంజనేయులు ,సాధంపల్లి శ్రీను ,బాల్ నారి ,మాధవరావు ,గోవర్ధనరావు ,లింగస్వామి, గందం వేంకట్రాములు ,రాజేష్ ,బాలకృష్ణ ,సందీప్ మరియు పశువైద్య సిబ్బంది అందరికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియచేస్తు ఇకముందుకూడా మీ సహకారం ఇదేవిదంగా ఉండాలని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమం లో గ్రామా నాయకులూ అనంత రెడ్డి ,నరసింహారెడ్డి ,నరసింహారావు ,చింతగాళ్ల శ్రీను ,అంతటి వెంకటయ్య గౌడ్ ,కర్నె లక్ష్మి నారాయణ ,అగ్రికల్చర్ ఆఫీసర్ రమేష్ , పశువైద్య సిబ్బంది డా రంజిత్ , ,మహేష్,శ్రీను, మిరాజ్ ,హబీబ్ అంజయ్య, తిరుపతయ్య ,శ్రీను , రైతులు నిరంజన్ పాల్గొనడం జరిగింది.




