Achampet: ఇందిరమ్మ ఇంట్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ దీపావళి సంబరాలు
Achampet: ఉప్పునుంతల మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల నూతన గృహంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ దీపాలు వెలిగించి దీపావళి జరుపుకున్నారు.
Achampet: ఇందిరమ్మ ఇంట్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ దీపావళి సంబరాలు
అచ్చంపేట: అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు బర్ల పుష్పలత, కృష్ణయ్య నూతన ఇందిరమ్మ ఇంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” వేడుకల్లో పాల్గొని, కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించి దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించిన.. TPCC ఉపాధ్యక్షులు & అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ.
ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న తెలంగాణ ప్రజా ప్రభుత్వం.. ప్రతి ఇంటా వెలుగులు నింపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు ప్రతి కుటుంబానికి ఆత్మగౌరవం, ఇందిరమ్మ ఇంట్లో దీపావళి ప్రతి గుండెల్లో ఆనందం కలిగిస్తుందని పేర్కొన్నారు.




