Achampet: అచ్చంపేటలో పశు, గొర్రెల పరిశోధన కేంద్రాలకు రూ.20.31 కోట్లు!
Achampet: నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో 100 ఎకరాల్లో తూర్పు పొడ గిత్తలు, దక్కనీ గొర్రెల పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం రూ.20.31 కోట్లు కేటాయిస్తూ జీవో జారీ చేసింది.
Achampet: అచ్చంపేటలో పశు, గొర్రెల పరిశోధన కేంద్రాలకు రూ.20.31 కోట్లు!
అచ్చంపేట: నల్లమల అరుదైన పశు సంపదకు, పాలమూరు గొర్రెలకు ఇక ప్రత్యేక గుర్తింపు దక్కనుంది. అచ్చంపేటలో 100 ఎకరాల్లో తూర్పు పొడ గిత్తలు, దక్కనీ గొర్రెల కోసం రెండు పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.20.31 కోట్లు కేటాయించింది. ఈ మేరకు గురువారం జీవో జారీ చేసింది. తూర్పు పొడ గిత్తలు శారీరక దృఢత్వం, శ్రమకు పెట్టింది పేరు కాగా, దక్కనీ గొర్రెలు మాంసం, ఉన్నికిప్రసిద్ధి.




