Achampet: లింగాల మండలం అంబట్పల్లిలో భూ రీ-సర్వే పనుల పరిశీలన!
Achampet: అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం అంబట్పల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ-సర్వే పనులను అచ్చంపేట సబ్ కలెక్టర్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Achampet: లింగాల మండలం అంబట్పల్లిలో భూ రీ-సర్వే పనుల పరిశీలన!
అచ్చంపేట: అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం అంబట్పల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే పనులను అచ్చంపేట సబ్ కలెక్టర్ బుధవారం క్షేత్రస్థా యిలోపరిశీలించారు.
గ్రామ శివారులోని పొలాల వద్దకు నేరుగా వెళ్లిన సబ్ కలెక్టర్, అక్కడ రోవర్ (DGPS) పరికరంతో సర్వే చేస్తున్న విధానాన్ని స్వయంగా గమనించారు. సర్వేలో హద్దులు ఎలా నిర్ణయిస్తున్నారు, శాటిలైట్ మ్యాప్ కు, క్షేత్రస్థాయి కొలతలకు పొంతన ఎలా కుదురుస్తున్నారు అనే విషయాలను సర్వే బృందాన్నిఅడిగితెలుసుకున్నారు.రైతులతో ఆత్మీయ సమావేశం, అనంతరం అక్కడికి వచ్చిన రైతులతో సబ్ కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు.
చాలా మంది రైతులు తమ భూములకు సంబంధించి ఉన్న సందేహాలను, పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఉన్న తేడాలను, హద్దుల విషయంలో పొరుగు రైతులతో ఉన్న వివాదాలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. వాటన్నింటినీ ఓపిగ్గా విన్న సబ్ కలెక్టర్, రీ సర్వే వల్లే అలాంటి సమస్యలన్నీ శాశ్వతంగా పరిష్కారం అవుతాయని రైతులకు భరోసా ఇచ్చారు.
ప్రతి ఎకరాను కచ్చితంగా కొలిచి, రైతు సమక్షంలోనే హద్దురాళ్లు వేయాలని, ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా పని చేయాలని సబ్ కలెక్టర్ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతులు కూడా సర్వే సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ పరిశీలనలో లింగాల తహశీల్దార్ వెంకటేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణాజి సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ అధికారి, స్థానిక రైతులు పాల్గొన్నారు.




