Achampet: అచ్చంపేట భ్రమరాంబ ఆలయంలో కార్తీక మాస శివాభిషేకం
Achampet: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని శ్రీ భ్రమరాంబ ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా శివుడికి పంచామృతాలతో అభిషేకం, సాయంత్రం ఆకాశదీపాలను వెలిగించారు.
Achampet: అచ్చంపేట భ్రమరాంబ ఆలయంలో కార్తీక మాస శివాభిషేకం
అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని శ్రీ భ్రమరాంబ ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ఈరోజు శివుడికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.
ఆలయ కమిటీ అధ్యక్షుడు, పోకల శ్రీధర్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉదయం నుంచి స్వామివారికి పాలు, పెరుగు, తేనె, పంచామృతాలతో అభిషేకం చేసి, బిల్వపత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు.
కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు సాయంకాలం ఆలయంలో ఆకాశదీపాలు వెలిగిస్తున్నారు. దీపాల కాంతులతో ఆలయ ప్రాంగణం శోభాయమానంగా మారుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, ఆకాశదీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు.




