Achampet: ఎస్సీ, బీసీ పట్టా భూములను కాపాడాలి అచ్చంపేట సబ్ కలెక్టర్‌కు వినతి

Achampet: అచ్చంపేటలో తమ పట్టా భూముల్లో ఎస్టీ గురుకులం, సబ్‌స్టేషన్ నిర్మాణాలను నిలిపివేయాలని బాధిత ఎస్సీ, బీసీ రైతులు సబ్ కలెక్టర్ సలోని చోబ్రాకు వినతిపత్రం.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 23 Oct 2026 5:45 PM IST
Achampet
X

Achampet: ఎస్సీ, బీసీ పట్టా భూములను కాపాడాలి అచ్చంపేట సబ్ కలెక్టర్‌కు వినతి

అచ్చంపేట: పట్టణంలోని సర్వే నెంబర్ 167, 167/2 , 1 67/4 , 167/22 , 167/31 , 167/32 , 167/37 లలో 59- ఎకరాల 20గుంటల భూమి ఉంది. ఈ భూమి ఎస్సీ మాదిగలకు , బీసీలకు సంబంధించిన పట్టా భూములు. ఈ భూములలో ప్రభుత్వము ఎస్టి గురుకుల విద్యాలయం , దక్షిణం వైపున ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ నిర్మాణం పనులు చేయాలని ప్రయత్నిస్తున్నారు.

ఈ పనులను వెంటనే నిలుపుదల చేయాలని భాధిత రైతులు జిలకర బాలేశ్వరయ్య, మల్లయ్య , శ్రీలత, మంగమ్మ, చిట్టెమ్మ , జంగమ్మ , హుస్సేన్ లు శుక్రవారం అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చోబ్రా కు వినతి పత్రం అందజేశారు. ఎవరికి, వారికి భూమికి సంబంధించిన పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి.

పేద ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న కొందరు పాలకులు ప్రభుత్వ కార్యాలయాలు దేవాలయాలు నిర్మిస్తూ బాధిత రైతులకు తీవ్ర మోసం చేస్తున్నారు. నిలుపుదల చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఈ విషయం పైన రెవెన్యూ డిపార్ట్మెంట్ రాష్ట్ర కార్యాలయంలో, లోకాయుక్త, రాష్ట్ర హైకోర్టులో కూడా ఫిర్యాదు చేసినట్లు సంబంధించిన ఆధారాలను వినతిపత్రం వెంట జత చేశారు. పై సర్వే నెంబర్లలో రాష్ట్ర స్థాయి సర్వే అధికారుల చేత పకడ్బందీగా సర్వే చేయించి , మా భూమి మాకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA