Achampet: బస్సులో సీటు దొరకలేదని జుట్టు పట్టుకుని తన్నుకున్న మహిళలు!
Achampet: నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట బస్టాండ్లో ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం ఇద్దరు మహిళల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. జుట్టు పట్టుకుని కొట్టుకోవడంతో డ్రైవర్ బస్సును ఆపేశాడు.
Achampet: బస్సులో సీటు దొరకలేదని జుట్టు పట్టుకుని తన్నుకున్న మహిళలు!
అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట బస్టాండ్ లో బస్సులోకి ఎక్కిన మహిళల మధ్య సీట్ల కోసం పెద్ద గొడవ చోటుచేసుకుంది. బస్సులో సీట్లు లేకపోవడంతో ఇద్దరు మహిళల మధ్య మాటామాటా పెరిగింది. కాసేపటికే ఒకరిపై ఒకరు దాడికి దిగారు. జుట్టు పట్టుకొని, తోసుకుంటూ కొట్టుకోవడంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
గొడవ తీవ్రం కావడంతో డ్రైవర్ బస్సును ఆపేశాడు. తోటి ప్రయాణికులు కల్పించుకొని ఇద్దరు మహిళలను విడదీసి గొడవను సద్దుమణిగించారు. అనంతరం డ్రైవర్ మహిళలకు నచ్చజెప్పి బస్సును తిరిగి ప్రారంభించాడు.




