Nagarkurnool: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రోడ్డు సమస్యను పట్టించుకోలేదు!

Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం కొమ్ముకుంట తాండలో బీఆర్ఎస్‌కు భారీ షాక్. డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సమక్షంలో 100 మంది కాంగ్రెస్‌లో చేరిక.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 31 Oct 2026 7:30 AM IST
Nagarkurnool
X

Nagarkurnool: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రోడ్డు సమస్యను పట్టించుకోలేదు!

Nagarkurnool: తాడూరు మండలంలోని కొమ్ముకుంట తాండలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామంలోని రోడ్డు సమస్యను పట్టించుకోలేదని, అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరగలేదని పార్టీ మారిన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.

రూ.2.కోట్ల 60 లక్షల నిధులతో బీటీ రోడ్డు పనుల ప్రారంభం

కొమ్ముకుంట తాండ ప్రజల చిరకాల రోడ్డు సమస్య పరిష్కారానికి మరో ముందడుగు పడింది. రూ.2 కోట్ల 60 లక్షల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. దీంతో గ్రామ ప్రజల ఎన్నో ఏళ్ల రోడ్డు సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైంది.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ రమేష్, మాజీ డిప్యూటీ సర్పంచ్ రాజు నాయక్, సోమలా నాయక్, లక్ష్మణ్ నాయక్, దీప్లా నాయక్, వార్డు సభ్యుడు మోతియా నాయక్, శంకర్ నాయక్, మంజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే యువ నాయకులు సురేష్, భానునాయక్, శివ రాథోడ్, శ్రీకాంత్, రాము, సురేష్, రాజేష్, వినోద్, మహేష్, శివ, మహేష్ బాబు, తారాసింగ్, చందర్, జగదీష్‌తో పాటు గ్రామ మహిళలు, యువత, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL