Health tips: వెయిట్ తగ్గాలని రన్నింగ్ చేస్తున్నారా.? ఇది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!
Health tips: బరువు తగ్గడానికి రన్నింగ్ చేయడం అనేది ఒక మంచి ఆప్షన్.
Health tips: వెయిట్ తగ్గాలని రన్నింగ్ చేస్తున్నారా.? ఇది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!
Health tips: బరువు తగ్గడానికి రన్నింగ్ చేయడం అనేది ఒక అద్భుతమైన మార్గం. అయితే, అధిక బరువు ఉన్నవారు రన్నింగ్ ద్వారా బరువు తగ్గాలనుకుంటే మాత్రం కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
నిపుణులు చెబుతున్న ముఖ్యమైన సూచనలు ఇవే:
గాయాల ప్రమాదం: ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కంటిన్యూగా పరిగెత్తితే, శరీర బరువు అంతా కాళ్లపై పడి కీళ్లు, కాలి ఎముకలపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల భవిష్యత్తులో తీవ్రమైన గాయాలు అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మధ్యలో బ్రేక్ ఇవ్వండి: రన్నింగ్ చేయడం పూర్తిగా అలవాటు అయ్యేంతవరకు ఏకధాటిగా పరిగెత్తకూడదు. మధ్యమధ్యలో కాసేపు బ్రేక్ తీసుకుంటూ నడవడం చేయాలని నిపుణులు చెబుతున్నారు.
సరైన షూస్ వాడకం: పరిగెత్తేటప్పుడు పాదాలపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు మంచి క్వాలిటీ ఉన్న కుషన్డ్ రన్నింగ్ షూస్ ధరించడం చాలా ముఖ్యం.
స్ట్రెంత్ ట్రైనింగ్: కేవలం రన్నింగ్ మాత్రమే కాకుండా, ఎముకలు, కండరాలను దృఢపరిచే స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా మీ వర్కౌట్ రొటీన్లో భాగం చేసుకుంటే ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.




