Health: రెగ్యులర్‌గా బీర్ తాగుతున్నారా? ఈ పార్ట్ డ్యామేజ్ కావడం పక్కా.!

Health: బీర్, హార్డ్ లిక్కర్ రెగ్యులర్‌గా తాగేవారికి కిడ్నీలు సడన్‌గా డ్యామేజ్ అయ్యే రిస్క్ ఎక్కువని తేలింది.

Ravi
By Ravi
Published on: 23 Nov 2026 10:01 AM IST
Health
X

Health: రెగ్యులర్‌గా బీర్ తాగుతున్నారా? ఈ పార్ట్ డ్యామేజ్ కావడం పక్కా.!

Health: రెగ్యులర్‌గా బీర్ లేదా హార్డ్ లిక్కర్ తాగే వారికి సడన్‌గా కిడ్నీలు డ్యామేజ్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుందని ఎంజిలియా రుస్కిన్ యూనివర్సిటీ రీసెర్చ్‌లో తేలింది. వైన్, లైట్ డ్రింకర్లలో ఈ రిస్క్ కొంత తక్కువగా ఉంటుందని సైంటిస్టులు తెలిపారు. గత 14 ఏళ్లుగా 2.50 లక్షల మంది డ్రింకర్లపై అధ్యయనం చేశారు. ఈ పరిశోధన ఫలితాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. రెగ్యులర్‌గా తాగే వారి కిడ్నీలు వ్యర్థాలను బయటకు పంపడంలో ఫెయిల్ అయ్యాయని పరిశోధకులు హెచ్చరించారు.

యూకే బయోబ్యాంక్ డేటాబేస్‌లోని 40 నుంచి 69 ఏళ్ల వయసు వారిని పరిశోధకులు పరిశీలించారు. సగటున 14 ఏళ్ల పాటు వీరిని ట్రాక్ చేయగా, 10,335 మందికి అక్యూట్ కిడ్నీ ఇంజూరీ వచ్చింది. కిడ్నీలు రక్తంలోని వ్యర్థాలను వడపోసే సామర్థ్యాన్ని అకస్మాత్తుగా కోల్పోయే తీవ్ర సమస్య ఇది. ఇది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి, కిడ్నీ ఫెయిల్యూర్, ముందస్తు మరణం ముప్పును పెంచుతుందని ప్రధాన పరిశోధకుడు రుడాల్ఫ్ షుట్టే తెలిపారు.

ఇప్పటివరకు మద్యం వల్ల కిడ్నీలు దెబ్బతినడానికి కారణం లివర్ సమస్యలే అని వైద్యులు భావించేవారు. తాజా అధ్యయనంలో లివర్ వ్యాధిని పరిగణనలోకి తీసుకున్నా బీర్, స్పిరిట్స్ తాగేవారిలో ముప్పు అలాగే ఉందని తేలింది. బీర్, స్పిరిట్స్ ఇన్‌ఫ్లమేషన్ ద్వారా కిడ్నీలను నేరుగా దెబ్బతీసే అవకాశం ఉందని షుట్టే వివరించారు. వారానికి 24 యూనిట్ల బీర్ తాగేవారిలో, 3 యూనిట్లు తాగేవారితో పోలిస్తే ఈ ముప్పు 14.8% ఎక్కువగా ఉంది. రెడ్, వైట్ వైన్ తాగేవారిలో మొత్తం మీద ప్రత్యేక సంబంధం కనిపించలేదు.

అయితే వైన్ కిడ్నీలను కాపాడుతుందని ఈ అధ్యయనం చెప్పడం లేదని పరిశోధకులు స్పష్టం చేశారు. యూకే సిఫార్సు చేసిన పరిమితి అయిన వారానికి 14 యూనిట్లు దాటితే, వైన్‌తో సహా అన్ని రకాల మద్యంలో ముప్పు పెరిగింది. ఇది పరిశీలనాత్మక అధ్యయనం కావడంతో, బీర్ లేదా లిక్కర్ వల్లే కిడ్నీలు దెబ్బతిన్నాయని నిరూపించలేదు. అధ్యయనంలో 40 నుంచి 69 ఏళ్ల వారే ఉండటంతో, ఫలితాలు ఇతర వయసుల వారికి వర్తించకపోవచ్చు. మద్యం మానేయడం లేదా జాతీయ మార్గదర్శకాల పరిమితిలో తీసుకోవడం సురక్షితమని పరిశోధకులు సూచించారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.