Vegetarian Diet Tips: శాఖాహారులకు షాకింగ్ న్యూస్.. మీ శరీరంలో ఈ 5 పోషకాలు లోపిస్తే ప్రాణాలకే ప్రమాదం

Vegetarian Diet Tips: భారతదేశంలో ఇటీవలి కాలంలో శాఖాహారం, వీగన్ డైట్ తీసుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.

CR Reddy
Published on: 27 Sept 2026 10:10 AM IST
Vegetarian Diet Tips
X

Vegetarian Diet Tips

Vegetarian Diet Tips: భారతదేశంలో ఇటీవలి కాలంలో శాఖాహారం, వీగన్ డైట్ తీసుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. మాంసాహారానికి దూరంగా ఉంటూ కేవలం మొక్కల ఆధారిత ప్రోటీన్లపైనే కొందరు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. అయితే సరైన అవగాహన లేకుండా కేవలం శాకాహారాన్ని మాత్రమే తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన పోషకాలు అందక పోషకాహార లోపం బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెజిటేరియన్ డైట్ పూర్తిగా సమతుల్యంగా లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.

అత్యంత కీలకమైన విటమిన్ బి12 లోపం

డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. శాకాహారుల్లో అత్యధికంగా కనిపించే ప్రధాన సమస్య విటమిన్ బి12 లోపం. మాంసాహారంలో లభించే ఈ విటమిన్, శాఖాహారంలో చాలా తక్కువగా లభిస్తుంది. దీనివల్ల శరీరంలో తీవ్రమైన అలసట, బలహీనత, చేతివేళ్లలో, కాళ్లలో జివ్వుమనే అనుభూతి, నరాల సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. ఈ లోపాన్ని నివారించడానికి శాఖాహారులు తృణధాన్యాలు, ఫోర్టిఫైడ్ ఆహారాలు, డాక్టర్ల సూచన మేరకు సప్లమెంట్లను తీసుకోవడం చాలా ముఖ్యం.

ఐరన్, ప్రోటీన్, కాల్షియం లోపాలు

శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచే ఐరన్ లోపం వల్ల అనీమియా (రక్తహీనత), తరచూ తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. అలాగే తగినంత ప్రోటీన్ అందకపోవడం వల్ల కండరాల బలం తగ్గిపోయి, శరీరం త్వరగా కోలుకోలేదు. వీటితో పాటు ఎముకలను దృఢంగా ఉంచే కాల్షియం, గుండె, మెదడు పనితీరుకు ఎంతో అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం కూడా శాకాహారుల్లో ఎక్కువగా చూస్తుంటామని వైద్యులు వెల్లడించారు.

శాఖాహారులు తీసుకోవాల్సిన పౌష్టికాహారం

ఈ పోషకాల లోపాల నుంచి బయటపడాలంటే కేవలం ఒకే రకమైన ఆహారానికి పరిమితం కాకుండా పప్పుధాన్యాలు, శనగలు, రాజ్మా, సోయా ఉత్పత్తులు, పనీర్, పాలు, పెరుగు, ఆకుకూరలను క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. రాగి, నువ్వులు, అవిసె గింజలు, చియా విత్తనాలు, వాల్‌నట్స్ వంటి వాటిని తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఒకవేళ తీవ్రమైన పోషకాల లోపం ఉన్నట్లు అనిపిస్తే, స్వయంగా ఎలాంటి సప్లమెంట్లు వాడకుండా వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం ఎంతో శ్రేయస్కరం.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.