Kitchen Tips: నెల రోజుల పాటు నిమ్మకాయలు తాజాగా ఉండాలా? ఈ సింపుల్ ట్రిక్స్ పాటించండి

Kitchen Tips: వేసవి కాలంలోనే కాకుండా ఏడాది పొడవునా వంటకాల్లో, సలాడ్లలో నిమ్మకాయల వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది.

CR Reddy
Published on: 18 Sept 2026 7:56 AM IST
Lemon Hacks
X

Lemon Hacks

Kitchen Tips: వేసవి కాలంలోనే కాకుండా ఏడాది పొడవునా వంటకాల్లో, సలాడ్లలో నిమ్మకాయల వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మార్కెట్ నుంచి ఒకేసారి ఎక్కువ నిమ్మకాయలు తెచ్చినప్పుడు అవి త్వరగా వాడిపోవడం, రంగు మారిపోవడం లేదా ఎండిపోవడం జరుగుతుంది. ఫ్రిజ్‌లో పెట్టినా కొన్ని రోజులకే వాటిపై మచ్చలు ఏర్పడి పాడైపోతుంటాయి. అలా జరగకుండా నిమ్మకాయలను ఎలాంటి రసాయనాలు లేకుండా, ఎక్కువ కాలం పాటు పాడవకుండా తాజాగా ఉంచుకోవడానికి కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే నిమ్మకాయలు నెల రోజుల పాటు అస్సలు చెడిపోవు.

నిమ్మకాయలను స్టోర్ చేయడానికి అద్భుతమైన మార్గాలు

ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అంజలి తెలిపిన వివరాల ప్రకారం.. నిమ్మకాయలను తాజాగా ఉంచడానికి మూడు అద్భుతమైన పద్ధతులు ఉన్నాయి. మొదటి పద్ధతిలో నిమ్మకాయలను ఒక శుభ్రమైన ఎయిర్‌టైట్ జార్‌లో వేసి, వాటిని పూర్తిగా మునిగేలా నీరు పోసి మూతపెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. రెండో పద్ధతిలో నిమ్మకాయలకి కొద్దిగా నూనె రాసి ఎయిర్‌టైట్ కంటైనర్‌లో భద్రపరుచుకోవాలి. ఇక మూడవ పద్ధతి ఏమిటంటే.. ఒక్కో నిమ్మకాయను విడివిడిగా టిష్యూ పేపర్‌లో చుట్టి ఎయిర్‌టైట్ బాక్స్‌లో పెడితే అవి నెల రోజుల పాటు అస్సలు పాడవకుండా సరిగ్గా సరికొత్తగా ఉంటాయి.

నిమ్మకాయతో కలిగే ప్రయోజనాలు

నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది, ఇది మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఉదయం పూట గోరువెచ్చని నీటిలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకుని తాగితే బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఫలితం ఉంటుంది. అలాగే జీర్ణక్రియ మెరుగ్గా పనిచేసేందుకు అల్లం రసం, నిమ్మరసం, చిటికెడు నల్ల ఉప్పు కలిపి తీసుకుంటే కడుపు సంబంధిత సమస్యలు దూరమవుతాయి. చర్మంపై ఉండే టానింగ్, మచ్చలను తగ్గించడానికి కూడా నిమ్మరసం బాగా పనిచేస్తుంది, అయితే దీన్ని నేరుగా చర్మానికి రాయకుండా నీటిలో కలిపి వాడటం మంచిది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.