కప్పు టీలో ఎన్ని క్యాలరీలు ఉంటాయి.? ఏది తాగితే మంచిది..
Tea: రోజుకొక కప్పు 'టీ' పడితేగానీ చాలామందికి ఏ పనీ మొదలవదు. అయితే మనం నిత్యం ఇష్టంగా తాగే ఆ కప్పు టీలో అసలు ఎన్ని క్యాలరీలు ఉంటాయో మీకు తెలుసా.?
కప్పు టీలో ఎన్ని క్యాలరీలు ఉంటాయి.? ఏది తాగితే మంచిది..
Tea: మనలో చాలామందికి ఉదయం నిద్రలేవగానే కప్పు వేడివేడి 'టీ' గొంతులో పడితేగానీ రోజు మొదలవదు. తలనొప్పిగా ఉన్నా, అలసటగా అనిపించినా ముందుగా గుర్తొచ్చేది టీ మాత్రమే. అయితే, మనం ప్రతిరోజూ ఇష్టంగా తాగే ఆ కప్పు టీలో ఎన్ని క్యాలరీలు ఉంటాయనే విషయంపై చాలామందికి సరైన అవగాహన ఉండదు. ఒక కప్పు టీలో ఉండే క్యాలరీలు ప్రధానంగా మనం అందులో కలిపే పదార్థాలపై ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు.
బ్లాక్ టీ / గ్రీన్ టీ: పాలు, చక్కెర ఏమాత్రం కలపకుండా తాగే బ్లాక్ టీ లేదా గ్రీన్ టీలో కేవలం 0 నుంచి 2 క్యాలరీలు మాత్రమే ఉంటాయి.
పాలు కలిపిన టీ: చక్కెర వేయకుండా కేవలం పాలు మాత్రమే కలిపిన టీ తాగడం ద్వారా మన శరీరంలోకి సుమారు 20 నుంచి 30 క్యాలరీలు చేరతాయి.
చక్కెర, పాలు కలిపిన టీ: ఒక స్పూన్ చక్కెర, పాలు కలిపి తీసుకునే ఒక రెగ్యులర్ కప్పు టీలో అత్యధికంగా 50 నుంచి 80 క్యాలరీల శక్తి ఉంటుందని అందులో పేర్కొన్నారు.
క్యాలరీల సంగతి ఎలా ఉన్నప్పటికీ, మోతాదుకు మించి టీ తాగడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు 2 కప్పులకు మించి టీ తాగితే భవిష్యత్తులో పలు ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారు, ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు చక్కెర, పాలు వాడకాన్ని తగ్గించుకుని, రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల టీకే పరిమితం అవ్వడం ఎంతో మంచిది.




