Rose Water: అందం పెంచే రోజ్ వాటర్.. రోజూ ఇలా వాడితే మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

రోజ్ వాటర్ చర్మాన్ని కాపాడటంలో అద్భుతంగా పనిచేస్తుంది. సహజ టోనర్‌గా, ఫేస్ మిస్ట్‌గా, ఫేస్ ప్యాక్‌లలో దీన్ని వాడటం ద్వారా చర్మం మెరిసిపోతుంది.

CR Reddy
Published on: 22 Oct 2026 10:44 AM IST
Rose Water
X

Rose Water

Rose Water: సహజసిద్ధమైన సౌందర్య సాధనాలలో రోజ్ వాటర్ ఎప్పుడూ ముందుంటుంది. ఇది కేవలం చర్మాన్ని కాపాడటమే కాకుండా అనేక రకాలుగా శరీరానికి మేలు చేస్తుంది. ఎలాంటి రసాయనాలు లేని ఈ సహజ పదార్ధాన్ని చర్మ సంరక్షణలో భాగంగా ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖంపై నిగారింపును పెంచడానికి, అలసిపోయిన చర్మానికి ప్రాణం పోయడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో సులభంగా దొరికే ఈ గులాబీ నీటితో ఎన్నో ఆరోగ్య, సౌందర్య లాభాలు పొందవచ్చు.

న్యాచురల్ టోనర్, ఫేస్ మిస్ట్

చర్మాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత రోజ్ వాటర్ ని సహజ టోనర్‌గా ఉపయోగించవచ్చు. దూది సహాయంతో ముఖానికి రాస్తే చర్మం సమతుల్యంగా మారి కాంతివంతంగా మారుతుంది. దీనికి కొన్ని విటమిన్ ఇ చుక్కలు కలిపితే మరింత మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఎండలో తిరిగి వచ్చినప్పుడు ముఖం డల్‌గా మారితే, స్ప్రే బాటిల్‌లో రోజ్ వాటర్ నింపుకుని ముఖంపై జల్లుకోవచ్చు. ఇది తక్షణ తాజాదననాన్ని ఇవ్వడంతో పాటు అలసటను దూరం చేస్తుంది.

ఫేస్ ప్యాక్‌లు, కంటికి ఉపశమనం

చందనం, పసుపు, కలబంద జెల్ వంటి వాటితో గులాబీ నీటిని కలిపి ప్యాక్ తయారు చేసుకోవచ్చు. దీన్ని ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత కడిగితే చర్మం మృదువుగా మారుతుంది. అలాగే రోజంతా కంప్యూటర్ల ముందు పనిచేసి అలసిపోయిన కళ్ళకు ఇది మంచి ఉపశమనం ఇస్తుంది. దూదిని గులాబీ నీటిలో తడిపి కళ్లపై ఉంచితే కంటి చుట్టూ ఉండే ఉబ్బరం తగ్గి ఎంతో రిలాక్స్‌గా అనిపిస్తుంది.

వంటకాల్లో గులాబీ నీటి వాడకం

కేవలం అందానికే కాకుండా వంటల్లో రుచిని, సువాసనను పెంచడానికి కూడా గులాబీ నీటిని వాడతారు. అయితే దీని కోసం ప్రత్యేకంగా లభించే ఫుడ్ గ్రేడ్ రోజ్ వాటర్‌ను మాత్రమే ఉపయోగించాలి. లస్సీ, కస్టర్డ్, సేమియా, ఖీర్, కలకంద వంటి మిఠాయిల్లో దీన్ని కలపడం ద్వారా అద్భుతమైన సువాసన వస్తుంది. వంటకాలకు సరికొత్త ఫ్లేవర్ అందించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.