Kurnool: కోడుమూరు సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో జెడ్పీ వైస్ చైర్మన్ డాక్టర్ సాదిక!

Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరు సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో జెడ్పీ వైస్ చైర్మన్ డాక్టర్ సాదిక పాల్గొని టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

C. Ganesh, Kodumuru
Published on: 29 Nov 2026 11:13 AM IST
Kurnool
X

Kurnool: కోడుమూరు సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో జెడ్పీ వైస్ చైర్మన్ డాక్టర్ సాదిక!

Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ డాక్టర్ సాదిక పాల్గొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోడుమూరులో ఎన్నో ఏళ్లుగా నెలకొన్న స్థానిక సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజలకు మెరుగైన సంక్షేమ పథకాలు అందించాలంటే టీడీపీ నాయకత్వంతోనే సాధ్యమని పేర్కొన్నారు.

ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేసే అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కోడుమూరు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల ఆశీర్వాదంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru