Markapuram: పెద్ద దోర్నాలలో కోలాహలంగా వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్!
Markapuram: పెద్ద దోర్నాల మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ బలపరిచిన గుమ్మ ఎల్లయ్య గురువారం మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నామినేషన్ వేశారు.
Markapuram: పెద్ద దోర్నాలలో కోలాహలంగా వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్!
మార్కాపురం జిల్లా: పెద్ద దోర్నాల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ బలపరిచిన గుమ్మ ఎల్లయ్య గురువారం కోలాహలంగా నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పెద్ద దోర్నాల చెక్‌పోస్ట్ సెంటర్‌లోని పోలేరమ్మ ఆలయం వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి భారీ ప్రదర్శనగా బయలుదేరారు. బాణాసంచా పేలుళ్లు, డప్పు వాయిద్యాలు, జై జగన్ నినాదాల మధ్య ఉత్సాహంగా స్వర్ణ గ్రామం-1లోని నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు.




