Aluru: ఆలూరు మండలంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం!

Aluru: కర్నూలు జిల్లా ఆలూరు మండలం కురుకుంద, ముద్దనగేరి, కరిడిగుడ్డం గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి రాజేశ్వరి రెడ్డి, రవి రెడ్డి జోరుగా ప్రచారం నిర్వహించారు.

Bheemalinga, Aluru
Published on: 1 Nov 2026 6:45 AM IST
Aluru
X

Aluru: ఆలూరు మండలంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం!

Aluru: కర్నూలు జిల్లా ఆలూరు మండలం కురుకుంద, ముద్దనగేరి, కరిడిగుడ్డం గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి రాజేశ్వరి రెడ్డి, రవి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు.

ఈ సందర్భంగా అభ్యర్థి రాజేశ్వరి రెడ్డి మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందాయని తెలిపారు. మహిళల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తమకు ఓటు వేసి గెలిపిస్తారనే ధీమా వ్యక్తం చేశారు.

అనంతరం రవి రెడ్డి మాట్లాడుతూ.. కురుకుంద, ముద్దనగేరి, కరిడిగుడ్డం గ్రామాల ప్రజలు వైఎస్సార్‌సీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. తాను గెలిస్తే మూడు గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడంతో పాటు తాగునీటి సమస్య లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రజల ముందుకు వస్తున్నామని, తమకు ఒక అవకాశం కల్పించాలని అభ్యర్థులు ప్రజలను కోరారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru