Alur: నీటి కోసం వెళ్లి బోరు గుంతలో పడి యువతి మృతి!

Alur: కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర తండాలో నీటి కోసం వెళ్లి బోరు గుంతలో పడి 28 ఏళ్ల యువతి మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.

Bheemalinga, Aluru
Published on: 27 Sept 2026 5:33 PM IST
Alur
X

Alur: నీటి కోసం వెళ్లి బోరు గుంతలో పడి యువతి మృతి!

Alur: కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర తండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తండాలో నీటి సమస్య తీవ్రంగా ఉండటంతో నీటి కోసం పొలానికి వెళ్లిన 28 ఏళ్ల యువతి ప్రమాదవశాత్తు బోరు గుంతలో పడిపోయి మృతి, ఈ ఘటనతో అరికెర తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

తండాలో చాలాకాలంగా నీటి సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఈ ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు వెంటనే స్పందించి అరికెర తండాలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru