Yemmiganur: టీడీపీ చైర్మన్ అభ్యర్థిపై రాజీవ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Yemmiganur: ఎమ్మిగనూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఇన్‌ఛార్జ్ రాజీవ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. టీడీపీ చైర్మన్ అభ్యర్థి మాచాని సునీతను టార్గెట్ చేస్తూ కామెంట్స్.

S Khaleel, Yemmiganur
Published on: 26 Oct 2026 8:19 PM IST
Yemmiganur
X

Yemmiganur: టీడీపీ చైర్మన్ అభ్యర్థిపై రాజీవ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో మునిసిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.వైసీపీ ఇంచార్జ్ రాజీవ్ రెడ్డి తన వ్యాఖ్యలతో ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు.

టీడీపీలో నంబర్ 2 గా ఉన్న భాస్కర్ల చంద్రశేఖర్ టార్గెట్ గా ప్రచారం నిర్వస్తున్నారు. రాజివ్ చేసిన వాఖ్యలు టీడీపీ లో కలకలం రేపుతున్నాయి. టీడీపీ చైర్మన్ అభ్యర్థి మాచాని సునీత అమాయకురాలని అక్క ను ముందు పెట్టి

అప్నా శేఖర్,ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి అరాచకాలు చేస్తారని,అక్క గెలిచాక ఆమెను పక్కన పెడతారని,ఆమె పరిపాలించే పరిస్థితి రాదని ఆమెను అడ్డుకొని వీళ్ళు అరాచకాలు చేస్తారని రాజివ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి ఈ వ్యాఖ్యలను ఎలా తీసుకుంటారన్న చర్చ ఇరు పార్టీల్లో సాగుతోంది. ఎమ్మెల్యే స్పందిస్తారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది.

S Khaleel, Yemmiganur

S Khaleel, Yemmiganur