Alur: బీసీవై పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యుడిగా ఎల్లార్తి అర్జున్ నియామకం!
Alur: బీసీవై పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యుడిగా కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎల్లార్తి వాల్మీకి అర్జున్ నియమితులయ్యారు.
Alur: బీసీవై పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యుడిగా ఎల్లార్తి అర్జున్ నియామకం!
Alur: కర్నూలు జిల్లా ఆలూరు BCY పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యులుగా BCY పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లార్తి వాల్మీకి అర్జున్ నియామకం. రాష్ట్ర స్థాయిలో అవకాశం కల్పించిన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ బలోపేతానికి నావంతుగా కృషి చేస్తాను. బిసివై జిల్లా అధ్యక్షుడు ఎల్లార్తి అర్జున్.
BCY పార్టీ అధినేత శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి పర్యటన శ్రేణులు సమన్వయం పార్టీలో చేరికలు,స్థానిక ఎన్నికలకు సమాయుక్తం నిమిత్తం BCY పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లార్తి అర్జున్ గారిని మరియు రాష్ట్రంలో మరి కొంతమందిని నియామకాలను చేస్తూ బిసివై పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి 26.09.2026 వ తేదీన అధికారికంగా ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎల్లార్తి అర్జున్ గారు విలేకరులతో మాట్లాడుతూ బిసివై పార్టీ ఇచ్చిన భాద్యతకు నేను ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని రానున్న ఎన్నికలలో నా పాత్ర మరింతగా కష్టపడి పార్టీని ప్రజలలోకి తీసుకెళ్లి ప్రజలకు అండగా ఉంటామని జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు యువకులను,నాయకులను, సీనియర్ నాయకులను,మహిళలను బిసివై పార్టీలో చేర్పించే అవకాశాన్ని తీసుకుంటానని తెలియజేస్తున్నాను.కర్నూలు జిల్లాకు సంబంధించి బిసివై పార్టీలో చేరే యువకులు, సీనియర్ నాయకులు, మహిళలు ఎవరైనా సరే కర్నూలు జిల్లా అధ్యక్షులు వారిని సంప్రదించాలని మనస్పూర్తిగా బిసివై పార్టీ తరుపున తెలియజేయడం జరిగింది.




