Nandyal: నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిలిచిన ఎక్స్-రే సేవలు!

Nandyal: నంద్యాల జిల్లా నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గత ఐదు రోజులుగా ఎక్స్-రే సేవలు నిలిచిపోవడంతో రోగులు ప్రైవేటు కేంద్రాలను ఆశ్రయిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 21 Sept 2026 2:41 PM IST
Nandyal
X

Nandyal: నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిలిచిన ఎక్స్-రే సేవలు!

Nandyal: రోజుకు 400 మంది OP తో నిత్యం బిజీగా ఉండే నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గత 5 రోజులుగా ఎక్స్-రే సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్స్-రే గదులకు తాళాలు వేసి ఉండటంతో రోగులు ప్రైవేటు ల్యాబ్ ల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

ఈ విషయంపై వైద్యాధికారి డాక్టర్:జక్కిని వివరణ కోరగా, ఇక్కడ పనిచేస్తున్న టెక్నీషియన్ సుందిపెంటకు డెప్యుటేషన్ పై వెళ్లారని, అదనపు సమాచారం కావాలంటే DCHO ను అడగాలని సమాధానం ఇచ్చారు.

400 మంది రోగులు వచ్చే ఆసుపత్రిలో ఒక్క టెక్నీషియన్ పై ఆధారపడటం, ఆయన వెళ్తే సేవలు మొత్తం బంద్ చేయడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఒక చోట పనిచేస్తున్న టెక్నీషియన్ ను వేరొక చోటికి డిప్యుటేషన్ పై పంపేప్పుడు ఇక్కడి రోగుల పరిస్థితిని గుర్తించకపోవడం, డెప్యుటేషన్ వేస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత DCHO ది కాదా?

పేదలకు ఉచితంగా అందాల్సిన సేవల కోసం ప్రైవేటులో రూ.300 నుంచి 500 వరకు చెల్లించాల్సి రావడంతో నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఎక్స్-రే సేవలు పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)