Kurnool: కర్నూలులో ప్రపంచ మధుమేహ దినోత్సవ అవగాహన ర్యాలీ!

Kurnool: ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా కర్నూలులో గాంధీ విగ్రహం వద్ద నుంచి వైద్యులు, నర్సులు అవగాహన ర్యాలీ నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 14 Nov 2026 2:16 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలులో ప్రపంచ మధుమేహ దినోత్సవ అవగాహన ర్యాలీ!

కర్నూలు: కర్నూలులో ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. మధుమేహంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వైద్యులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

గాంధీ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమైన ఈ అవగాహన ర్యాలీ లో వైద్యులు, నర్సులు, పాల్గొన్నారు. చేతిలో ప్లకార్డులు పట్టుకుని మధుమేహాన్ని జయిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం" అంటూ నినాదాలు చేశారు.

డాక్టర్ మాట్లాడుతూ... ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా భారతదేశంలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. సరైన ఆహారం, నడక, వ్యాయామం, సమయానికి పరీక్షలు చేయించుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చు."

చాలా మంది తమకు షుగర్ ఉందని తెలియకుండానే తిరుగుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ రెగ్యులర్ గా షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. ముందు జాగ్రత్తతోనే మధుమేహం వల్ల వచ్చే గుండె, కిడ్నీ, కంటి సమస్యలను నివారించవచ్చు.

మధుమేహం అంటే భయపడాల్సిన అవసరం లేదని, జీవనశైలిలో మార్పులతో దాన్ని అదుపులో ఉంచుకోవచ్చని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అవగాహన కరపత్రాలను పంపిణీ చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నినాదంతో ఈ ర్యాలీ ముగిసింది.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL