Kurnool: పేదల సంక్షేమమే కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
Kurnool: పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. సి.బెళగల్ మండలం పోలకల్లో పింఛన్లు పంపిణీ చేశారు.
Kurnool: పేదల సంక్షేమమే కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
కర్నూలు జిల్లా: పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాల ఆర్థిక భద్రత, ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రతి నెలా ఆర్థిక సహాయం అందిస్తూ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తోందన్నారు.
ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తాం అని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా అందేలా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో బెళగల్ మండల ఎంపీడీవో, అగ్రికల్చర్ ఆఫీసర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, పోలకల్ పంచాయతీ కార్యదర్శి, జనసేన కోడుమూరు ఇన్చార్జి అకేపోగు రాంబాబు, బెళగల్ మండల కన్వీనర్ చంద్రశేఖర్, నాయకులు తిమ్మప్ప, అమర్, వీరన్న గౌడ్, ధనుంజయ, నాగరాజు, మాజీ ఎంపీటీసీ యాకోబు, గుండ్రేవుల బాబు, గుండ్రేవుల మాజీ ఎంపీటీసీ చాంద్, తిమ్మం దొడ్డి సూరి, బ్రాహ్మణదొడ్డి బాబు, మారందొడ్డి సోమప్ప, కొత్తకోట హరి, ముడుమల పౌలు, ఈర్లదిన్నె వెంకటేష్ రెడ్డి, కె. సింగారం మల్లేష్, చెరువుపల్లె రాజు, హనుమంత్ గౌడ్, తిమ్మం దొడ్డి దస్తగిరి తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




