Kurnool: కోడుమూరులో హరిహర క్షేత్రంగా శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం!
Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరులో రూ.21 కోట్లతో హరిహర క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న శ్రీలక్ష్మీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ పనులను వీహెచ్‌పీ నాయకులు పరిశీలించారు.
Kurnool: కోడుమూరులో హరిహర క్షేత్రంగా శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం!
Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో 21 కోట్లతో నిర్మిస్తున్న శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆదోని వి.హెచ్.పి సంచాలకులు పరిశీలించారు. హరిహర క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయాన్ని అద్భుతమైన రాతి కట్టడాలతో నిర్మిస్తున్నారని వారు కొనియాడారు. ఆలయ నిర్మాణ పనులను చక్కగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ ఛైర్మన్ ఎద్దుల మహేశ్వరరెడ్డి, ఆయన బృందాన్ని అభినందించారు.'




