Kodumuru: కోడుమూరులో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు!

Kodumuru: కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

C. Ganesh, Kodumuru
Published on: 26 Oct 2026 12:50 PM IST
Kodumuru
X

Kodumuru: కోడుమూరులో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు!

Kodumuru: కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి విగ్రహానికి నివాళులర్పించి, ఆయన జీవిత విశేషాలను, సమాజానికి అందించిన సందేశాలను స్మరించుకున్నారు.

రామాయణ మహాకావ్యాన్ని రచించి ప్రపంచానికి ధర్మం, సత్యం, న్యాయం, మానవతా విలువలను చాటిచెప్పిన వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆయన బోధనలు నేటి సమాజానికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. వాల్మీకి మహర్షి ఆశయాలను భావితరాలకు అందించడంతో పాటు, ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు.

ఈ జయంతి వేడుకల్లో కోట్ల హరి చక్రపాణి రెడ్డి, రఘునాథ రెడ్డి, రమేష్ నాయుడు, యువ నాయకుడు హనుమంతు (అంజి), ధర్మం పూరి అయ్యప్పస్వామి ఆలయ కమిటీ సభ్యులు నల్లబోతుల భాస్కర్ రెడ్డి, జీతూరి రవి, న్యాయవాది ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru