Nandyal: వల్లంపాడు ఎస్సీ కాలనీలో నిలిచిన మురుగునీరు: ఇబ్బందిపడుతున్న జనం!
Nandyal: నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం వల్లంపాడు ఎస్సీ కాలనీలో రోడ్లపై నిలిచిన మురుగునీరు. కాలువలు నిర్మించాలంటూ కాలనీవాసుల ఆవేదన.
Nandyal: వల్లంపాడు ఎస్సీ కాలనీలో నిలిచిన మురుగునీరు: ఇబ్బందిపడుతున్న జనం!
Nandyal: గత 15 సంవత్సరాలుగా సీసీ రోడ్డుకు కాలువలు వేయని అధికారులు. కోవెలకుంట్ల మండలం వల్లంపాడు గ్రామంలో 2014లో ఇప్పటి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వల్లంపాడు ఎస్సీ కాలనీకి చేరుకొని అధికారులకు కాలువలు వేయాలని సూచించారు. 15 సంవత్సరాల అవుతున్న సీసీ రోడ్డుకు కాలువలు అధికారులు వేయలేదు.
ఇళ్లచుట్టూ మురుగునీరు చిన్నపాటి వర్షం చేరడంతో కుంటను తలపిస్తున్న ఎస్సీ కాలనీ. ఇబ్బంది పడుతున్న ఎస్సీ కాలనీ వాసులు. నీరంతా రోడ్లపై చేరి కుంటగా చేరి దుర్గంధం వెదజల్లుతుంది. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వచ్చి ఆసుపత్రుల పాలవుతున్న కాలానివాసులు గ్రామస్తులు.
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నియోజకవర్గంలో ఉన్న కోవెలకుంట్ల వల్లంపాడు ఎస్సీ కాలనీ సీసీ రోడ్డుకు కాలువలు వేయాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.




