Kurnool: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న ఉపాసన!

Kurnool: కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన, శ్రీమఠం పీఠాధిపతుల ఆశీస్సులు.

Eeranna, Mantralayam
Published on: 17 Sept 2026 12:59 PM IST
Kurnool
X

Kurnool: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న ఉపాసన!

Kurnool: కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన ప్రత్యేక హైలిక్యాప్టర్ లో విచ్చేశారు. ఆమేకు శ్రీ మఠం అధికారులు సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు.

ఆమె ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకొని అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృదావనంకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీమఠం పీఠాధిపతులు సుభుదేంద్ర తీర్థులు ఫల మంత్రాక్షితాలు ఇచ్చి ఆశీర్వదించారు.

పీఠాధిపతులు ఉపాసనతో మాట్లాడుతూ మంత్రాలయం ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కావడంతో నిత్యం వేలాది మంది భక్తులు వస్తారని వచ్చే భక్తులకు ఎదైనా అనారోగ్యానికి గురైతే అన్ని వేళల్లో అందుబాటులో ఉండే అపోలో మెడికల్ షాప్ ఎర్పాటు చేయాలని అన్నారు. అవసరమైతే మీ మావగారు మెగస్టార్ చిరంజీవిని మంత్రాలయంకు పిలుచుకొని రావాలని అన్నారు.

Eeranna, Mantralayam

Eeranna, Mantralayam