Markapuram: మార్కాపురం కేంద్రంగా పనిచేస్తున్న ఇద్దరు ఎస్‌డీసీలపై సస్పెన్షన్ రద్దు!

Markapuram: విధులకు గైర్హాజరైన మార్కాపురం, కంభం ఎస్‌డీసీలు సత్యనారాయణ, వెంకటేశ్వరరావులపై సస్పెన్షన్ వేటు వేసిన ప్రభుత్వం కొద్దిసేపటికే ఉత్తర్వులను ఉపసంహరించుకుంది.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 22 Nov 2026 7:06 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం కేంద్రంగా పనిచేస్తున్న ఇద్దరు ఎస్‌డీసీలపై సస్పెన్షన్ రద్దు!

మార్కాపురం: మార్కాపురం కేంద్రంగా పనిచేస్తున్న ఇద్దరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల (SDC)పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అయితే సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడిన కొద్దిసేపటికే వాటిని ఉపసంహరించుకోవడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సస్పెన్షన్‌కు గురైన వారిలో ఎం.వి. సత్యనారాయణ, కంభం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం. వెంకటేశ్వరరావు ఉన్నారు. వీరిద్దరూ ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఎం.వి. సత్యనారాయణ జూలై 22 నుంచి, ఎం. వెంకటేశ్వరరావు సెప్టెంబర్ 2 నుంచి విధులకు హాజరుకావడం లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ బుధవారం ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సస్పెన్షన్ ఉత్తర్వులు విడుదలైన కొద్దిసేపటికే ప్రభుత్వం మరోసారి స్పందించి, వారి సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ వేర్వేరు జీవోలు జారీ చేసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీర్ఘ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

సస్పెన్షన్ విధించడం.. కొద్దిసేపటికే ఉపసంహరించుకోవడం వెనుక కారణాలేమిటన్నది ప్రస్తుతం అధికార వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM