Nandyal: డోన్‌లో రోడ్ ట్యాక్స్ చెల్లించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై చర్యలు!

Nandyal: నంద్యాల జిల్లా డోన్‌లో రవాణా శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో రోడ్ ట్యాక్స్ చెల్లించని నాలుగు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు.

Bharat Raj, Dhone
Published on: 5 Oct 2026 12:02 PM IST
Nandyal
X

Nandyal: డోన్‌లో రోడ్ ట్యాక్స్ చెల్లించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై చర్యలు!

Nandyal: డోన్‌లో రోడ్ ట్యాక్స్ చెల్లించని ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. డోన్ MVI టి. క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో అక్టోబర్ 4 రాత్రి నుంచి 5వ తేదీ తెల్లవారుజాము వరకు నేషనల్ హైవే–44పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రోడ్ ట్యాక్స్ చెల్లించకుండా ప్రయాణిస్తున్న నాలుగు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను గుర్తించి కేసులు నమోదు చేశారు.

Kallada Travels, Golden Tours & Travel, Sudheer Travels, Dhanunjay Travels బస్సులపై చర్యలు తీసుకున్నారు. మొదటి మూడు బస్సులపై ఒక్కొక్కదానిపై రూ.1.46 లక్షలు, నాలుగో బస్సుపై రూ.1.80 లక్షల చొప్పున పన్ను, జరిమానా విధించారు. మొత్తం రూ.6.18 లక్షలు వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాల ట్రావెల్స్ వాహనాలపై కూడా తనిఖీలు కొనసాగుతాయని MVI తెలిపారు.

Bharat Raj, Dhone

Bharat Raj, Dhone