Kurnool: కర్నూలు 24వ వార్డు జనసేన అభ్యర్థిగా తోళ్ళ మల్లేశ్వరి
Kurnool: కర్నూలు నగరపాలక సంస్థ 24వ వార్డు జనసేన కార్పొరేటర్ అభ్యర్థిగా తోళ్ళ మల్లేశ్వరి బరిలో నిలిచి, వార్డు అభివృద్ధి ధ్యేయంగా ప్రచారం ముమ్మరం చేశారు.
Kurnool: కర్నూలు 24వ వార్డు జనసేన అభ్యర్థిగా తోళ్ళ మల్లేశ్వరి
కర్నూలు: కర్నూలు నగరపాలక సంస్థ 24వ వార్డు జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా తోళ్ళ మల్లేశ్వరి బరిలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ తోళ్ళ మంజునాథ్ సతీమణి అయిన మల్లేశ్వరి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగి ప్రచారం ముమ్మరం చేశారు....
వార్డు అభివృద్ధే ప్రధాన లక్ష్యం
24వ వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంతో పాటు, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని తెలిపారు... వార్డులో మౌలిక సదుపాయాల మెరుగుదల, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, వీధి దీపాల వంటి ప్రజా అవసరాలకు ప్రాధాన్యం ఇస్తామని అవకాశం కల్పిస్తే సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు...
ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించే దిశగా అడుగులు వేస్తామన్నారు..
ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు.. జనసేన పార్టీ తరఫున 24వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమెకు ఓటర్లు మద్దతు ఇవ్వాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.




