Alur: తిమ్మాపురం, నగరడోన్లో కూటమి ప్రచారం జోరు
Alur: చిప్పగిరి మండలం తిమ్మాపురం, నగరడోన్లలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి సాహీరా బేగం, ఎంపీటీసీ అభ్యర్థి గోపాల్ తరఫున నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Alur: తిమ్మాపురం, నగరడోన్లో కూటమి ప్రచారం జోరు
కర్నూలు జిల్లా: ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం తిమ్మాపురం, నగరడోన్ గ్రామాల్లో కూటమి ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి నాయకులు ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఆలూరు టీడీపీ మాజీ ఇంచార్జ్ వైకుంఠం శివప్రసాద్, ఆలూరు నియోజకవర్గ బీజేపీ బీఎల్‌ఓ-1 గుమ్మనూరు నారాయణ, ఏరూరు మీనాక్షి నాయుడు, జడ్పీటీసీ అభ్యర్థి సాహీరా బేగం, ఎంపీటీసీ అభ్యర్థి నగరడోన్ గోపాల్ కలిసి గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, ఆలూరు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ఎన్నికల ప్రచారానికి గ్రామాల్లో ప్రజల నుంచి లభిస్తున్న ఆత్మీయ స్వాగతం, అపారమైన ఆదరణ తమకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గుమ్మనూరు నారాయణ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




