Holagunda: ఎస్సై దిలీప్ కుమార్ వ్యవహారశైలిపై ఆగ్రహం!
Holagunda: కర్నూలు జిల్లా హోలగుందలో టీడీపీ రెబల్ అభ్యర్థి ఈడిగ గోవింద్ గౌడ్ ఇంటి వద్ద ఉద్రిక్తత. కుమారుడి అరెస్టు యత్నాన్ని అడ్డుకున్న స్థానికులు.
Holagunda: ఎస్సై దిలీప్ కుమార్ వ్యవహారశైలిపై ఆగ్రహం!
Holagunda: కర్నూలు జిల్లా హోలగుంద మండలంలో పోలీసుల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. టీడీపీ రెబల్‌గా జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోవింద్ గౌడ్ ఇంటిపై పోలీసులు దాడులకు వెళ్లడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
తండ్రి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడనే కారణంతో తన కుమారుడిని అరెస్టు చేసేందుకు ఎస్సై దిలీప్ కుమార్ వెళ్లినట్లు గోవింద్ గౌడ్ ఆరోపించారు . ఈ ఘటనపై ఎన్నికల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని స్వతంత్ర అభ్యర్థి గోవింద్ స్పష్టం చేశారు.
పోలీసుల చర్యను అడ్డుకునేందుకు గ్రామస్తులు పోలీసు వాహనాన్ని చుట్టుముట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో గ్రామస్తులపై లాఠీఛార్జ్‌కు ఎస్సై ప్రయత్నించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
పోలీసుల వ్యవహారశైలిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అడ్డుకుంటారా.. మీ అంతు చూస్తానంటూ ఎస్సై దిలీప్ కుమార్ హెచ్చరించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే ఇలా వ్యవహరిస్తున్నారంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.




