Vemulapadu: అరాచక ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలి: దద్దాల

Vemulapadu: హనుమంతునిపాడు మండలం వేములపాడులో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి రాయని ధనలక్ష్మి తరఫున డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Guravayya, Kanigiri
Published on: 31 Oct 2026 9:35 PM IST
Vemulapadu
X

Vemulapadu: అరాచక ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలి: దద్దాల

మార్కాపురం జిల్లా, వేములపాడు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుని అరాచక కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పిలుపునిచ్చారు.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హనుమంతునిపాడు మండలం వేములపాడు పంచాయతీలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి రాయని ధనలక్ష్మి తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి రాయని ధనలక్ష్మిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండున్నరేళ్లుగా కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలనకు ప్రజలు తమ ఓటుతో సమాధానం చెప్పాలన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, పోలీసులను తమ గుప్పెట్లో పెట్టుకుని ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కూటమి నేతలకు ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము ఇంటింటికీ వెళ్తున్నప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు, చంద్రబాబు పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలు స్వయంగా బేరీజు వేసుకుంటున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో భూకబ్జాలు, దందాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని విమర్శించారు.

ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తే ప్రజలకు, ప్రతి గడపకు కాపలాదారులుగా ఉంటామని, కూటమి నాయకుల దౌర్జన్యాలను అడుగడుగునా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకు ప్రజలు తమ ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని దద్దాల నారాయణ యాదవ్ కోరారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Guravayya, Kanigiri

Guravayya, Kanigiri