Devanakonda: దేవనకొండలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ షేక్ సాధిక ఎన్నికల ప్రచారం ప్రారంభం!

Devanakonda: కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ షేక్ సాధిక మాచాపురం గ్రామం నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించారు.

G Jagadeesh, Pathikonda
Published on: 25 Oct 2026 10:31 AM IST
Devanakonda
X

Devanakonda: దేవనకొండలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ షేక్ సాధిక ఎన్నికల ప్రచారం ప్రారంభం!

Devanakonda: దేవనకొండలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ సాధిక ఎన్నికల ప్రచారం ప్రారంభంమాచాపురం నుంచి ప్రచారానికి శ్రీకారం. జడ్పీటీసీతో పాటు కూటమి ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి దేవనకొండ. తెలుగుదేశం పార్టీ దేవనకొండ మండల జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ షేక్ సాధిక ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

ఆదివారం ఉదయం 7 గంటలకు దేవనకొండ మండలంలోని మాచాపురం గ్రామం నుంచి ఆమె ప్రచారానికి శ్రీకారం చుట్టారు. టీడీపీ మండల కన్వీనర్ విజయ్ భాస్కర్ గౌడ్‌తో పాటు పలువురు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ షేక్ సాధిక గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి జడ్పీటీసీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో తనతో పాటు టీడీపీ, కూటమి ఎంపీటీసీ అభ్యర్థులను కూడా గెలిపించాలని కోరారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులను పలకరిస్తూ వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన తాను ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు.

డాక్టర్ సాధికకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి ప్రజాసేవా కార్యక్రమాలు తనను రాజకీయాల్లోకి వచ్చేలా ప్రేరేపించాయని తెలిపారు.

ప్రజల ఆదరణతో తనను జడ్పీటీసీగా గెలిపిస్తే దేవనకొండ మండల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.టీడీపీ నాయకుడు ఈదుల దేవరబండ సుభాన్ మాట్లాడుతూ ప్రజలు సైకిల్ గుర్తుపై ఓటు వేసి డాక్టర్ షేక్ సాధికను జడ్పీటీసీగా, టీడీపీ, కూటమి ఎంపీటీసీ అభ్యర్థులను ఆయా స్థానాల్లో గెలిపించాలని కోరారు.మాచాపురంలో ప్రారంభమైన ఎన్నికల ప్రచారం బండగట్టు, నెల్లిబండ, కరివేముల గ్రామాల్లోనూ కొనసాగుతుందని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బండి గింజల రంగన్న, ఆకుల వీరేష్, కప్పట్రాళ్ల మల్లికార్జున, భాస్కర్, నెల్లిబండ మల్లికార్జున, రాజు తదితరులతో పాటు కూటమి ఎంపీటీసీ అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda