Kurnool: ముత్తుకూరులో టీడీపీ విజయం: వైసీపీపై నేతల ఆగ్రహం

Kurnool: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరు ఎంపీటీసీ స్థానంలో 9 ఓట్లతో టీడీపీ గెలుపొందగా, ఓటమి జీర్ణించుకోలేక వైసీపీ రహస్య వీడియోలతో కుట్రలు చేస్తోందని టీడీపీ నేతలు మండిపడ్డారు.

G Jagadeesh, Pathikonda
Published on: 9 Nov 2026 2:43 PM IST
Kurnool
X

Kurnool: ముత్తుకూరులో టీడీపీ విజయం: వైసీపీపై నేతల ఆగ్రహం

కర్నూల్ జిల్లా: వైసీపీ మరోసారి వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపిందా? పక్కనే కూర్చొని మాట్లాడినట్లు నటిస్తూ రహస్యంగా వీడియోలు చిత్రీకరణ.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ అభ్యర్థిని ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ టీడీపీ నేతల ఆగ్రహం.

రీకౌంటింగ్‌కు సహకరించని వైసీపీ నాయకులు.. ఓటమి భయంతోనే వెనుకడుగు వేశారంటూ ఘాటు విమర్శలు.

ప్రజలు ఇచ్చిన ప్రజాతీర్పును జీర్ణించుకోలేక వైసీపీ నాయకులు మరోసారి తమ రాజకీయ కక్షసాధింపు ధోరణిని బయటపెడుతున్నారని టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందలేకపోయిన వైసీపీ నాయకులు ఇప్పుడు గెలిచిన అభ్యర్థిని లక్ష్యంగా చేసుకుని అనవసర వివాదాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు.

పక్కనే కూర్చొని ఆప్యాయంగా మాట్లాడుతున్నట్లు వ్యవహరిస్తూ, రహస్యంగా వీడియోలు చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం ఎంతవరకు సమంజసమని టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో అభ్యర్థిని అటు పార్టీ పరంగా, ఇటు ప్రజల మధ్య అనవసర ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం వైసీపీ నాయకుల రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు.

మరోవైపు ఎన్నికల కౌంటింగ్ సమయంలోనూ వైసీపీ నాయకుల వ్యవహారశైలిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రీకౌంటింగ్ ప్రక్రియకు సహకరించకుండా ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రశ్నించడం వెనుక ఆంతర్యమేమిటని నిలదీశారు. ఓటమిని అంగీకరించే ధైర్యం లేకనే ఇలాంటి వైఖరిని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.

గత పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, అసంతృప్తికి ఎన్నికల ఫలితాలే సమాధానమని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరించిన నాయకులు, ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించలేకపోతున్నారని మండిపడ్డారు.

చివరకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తికాగా టీడీపీ అభ్యర్థి 9 ఓట్ల మెజార్టీతో ఎంపీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మెజార్టీ తక్కువైనా ప్రజలు అందించిన విజయం ఎంతో విలువైనదని టీడీపీ శ్రేణులు పేర్కొన్నాయి.

ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు..

ప్రజల తీర్పే అంతిమం. రాజకీయంగా పోరాడలేక వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు చేయడం, సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వివాదాలు సృష్టించడం రాజకీయ సంస్కారం అనిపించుకోదు. ప్రజల ఓటుతో గెలిచిన అభ్యర్థిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవాలి తప్ప.. రహస్య వీడియోలు, వ్యక్తిగత విమర్శలతో ఇబ్బందులకు గురిచేయడం తగదని.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda