Kurnool: ఆలూరులో టీడీపీ రెబల్స్‌పై సస్పెన్షన్ వేటు!
Kurnool: ఆలూరులో కూటమి నిర్ణయాన్ని ధిక్కరించి జడ్పీటీసీకి ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్న ఇద్దరు టీడీపీ నేతలను జిల్లా అధ్యక్షుడు గుడిసె కృష్ణమ్మ సస్పెండ్ చేశారు
Kurnool: ఆలూరులో టీడీపీ రెబల్స్‌పై సస్పెన్షన్ వేటు!
Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి నిర్ణయాన్ని ధిక్కరించి ఇండిపెండెంట్ అభ్యర్థులుగా జడ్పీటీసీ ఎన్నికల బరిలో నిలిచిన ఇద్దరు టీడీపీ నేతలపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.
కూటమి తరఫున ప్రభుత్వం అధికారికంగా బీఎఫ్ఎం (BFM) ఇచ్చిన అభ్యర్థులకే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నాయకులు, కార్యకర్తలు పూర్తి మద్దతు తెలిపి వారి విజయానికి కృషి చేయాలని కూటమి ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఈ ఆదేశాలను ధిక్కరిస్తూ ఆలూరు మండలానికి చెందిన బెంగళూరు కిషోర్, హొళగుంద మండలానికి చెందిన ఇడిగ గోవిందు స్వతంత్ర జడ్పీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసి ఎన్నికల బరిలో నిలిచారు.
పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న నేపథ్యంలో వీరిద్దరినీ టీడీపీ నుంచి సస్పెండ్ చేసినట్లు జిల్లా టీడీపీ అధ్యక్షులు గుడిసె కృష్టమ్మా వెల్లడించారు. కూటమి నిర్ణయానికి కట్టుబడి ఉండాలనే స్పష్టమైన సంకేతాలను ఈ చర్య ద్వారా పార్టీ నాయకత్వం ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.




